Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్రిక్త‌త‌ న‌డుమ ర‌మ్య పోస్ట్ మార్ట‌మ్...నారా లోకేష్ అరెస్ట్

nara lokesh
Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (14:55 IST)
గుంటూరులో హ‌త్య జ‌రిగిన ర‌మ్య మృత‌దేహాన్ని సంద‌ర్శించి, ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న్ని ప్ర‌త్తిపాడు పోలీస్ స్టేష‌న్లో ఉంచారు.

ర‌మ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గుంటూరు చేరుకున్న నారా లోకేష్, నారా లోకేష్ వెంట నక్క ఆనంద్ బాబు, ఎమ్మెస్ రాజు, మద్దిరాల మేని, పిల్లి మాణిక్యరావు తదితర దళిత నేతలు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వారిని ప్ర‌భుత్వాసుప‌త్రి వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంత‌కు ముందు. నారా లోకేష్ రాక ముందే, ర‌మ్య మృత దేహాన్ని త‌ర‌లించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌గా, అంబులెన్స్ ముందు తెలుగుదేశం నాయ‌కులు బైఠాయించారు.

దీనితో పోలీసులు బ‌ల‌వంతంగా టీడీపీ నేత‌ల్ని అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ను అరెస్టు చేసి, ప్ర‌త్యేక పోలీస్ వాహ‌నంలో ప్ర‌త్తిపాడు పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించారు. స్టేష‌న్లో సిఐ ఛాంబ‌ర్లో ఆయ‌న్ని కుర్చోబెట్టారు. దీనితో త‌న‌ను ఎందుకు అరెస్ట్ చేశార‌ని నారా లోకేష్ పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments