Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు వ్యూహం... వచ్చే ఎన్నికల్లో ఎంపీగా నారా బ్రాహ్మణి పోటీ

నారా బ్రాహ్మణి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముద్దుల కుమార్తెల్లో ఒకరు. ప్రస్తుతం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు నారా లోకేష్ సతీమణి. ఒక బిడ్డకు తల్లి. ఉన్నత విద్యావంతురాలు. చ

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (08:56 IST)
నారా బ్రాహ్మణి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముద్దుల కుమార్తెల్లో ఒకరు. ప్రస్తుతం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు నారా లోకేష్ సతీమణి. ఒక బిడ్డకు తల్లి. ఉన్నత విద్యావంతురాలు. చూడచక్కని అందం. ఈమె వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో నలుగురు కీలక పదవుల్లో ఉన్నారు. ఈ నలుగురే ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. వీరిలో ఒకరు కేసీఆర్ కాగా, రెండో వ్యక్తి ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కుమార్తె టి కవితలు. ఇందులో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్, హరీష్‌లు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. ఇక కవిత నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈమె ఢిల్లీలో తెరాస రాజకీయాలను చక్కబెట్టడంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలోనూ అత్యంత కీలక భూమికను పోషిస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలోనే బ్రాహ్మ‌ణిని సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి గెలిపించి ఆమెను ఢిల్లీకి పంపాల‌ని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన తనయుడు నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీంతో ఆయన సతీమణిని సైతం రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నారు. సమ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వ ల‌క్ష‌ణాలు, ఆంగ్ల భాష‌పై ప‌ట్టు ఉన్న బ్రాహ్మ‌ణిని ఢిల్లీకి పంపితే ఏపీకి వ‌చ్చే నిధులు, ఇత‌ర‌త్రా ప‌నుల విష‌యంలో ఢిల్లీలో ప‌నులు చ‌క్క‌బెట్టే సామ‌ర్థ్యం వ‌స్తుంద‌ని బాబు భావిస్తున్నారు.
 
ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ్రాహ్మ‌ణిని గుంటూరు లేదా అనంత‌పురం జిల్లాలోని హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఓ చోట నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దింపుతార‌ని తెలుస్తోంది. జ‌య‌దేవ్ ప్ర‌స్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. బ్రాహ్మ‌ణి అక్క‌డి నుంచి పోటీచేసే క్ర‌మంలో జ‌య‌దేవ్‌ను చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయిస్తార‌ని టాక్‌. ఒక వేళ టీడీపీకి ప‌ట్టున్న అనంత‌పురం జిల్లాలోని హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెను పోటీ చేయిస్తే అక్క‌డ సిట్టింగ్ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌కు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల‌ని బాబు యోచ‌న‌గా తెలుస్తోంది. ఏదేమైనా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ్రాహ్మ‌ణిని ఎంపీగా బ‌రిలోకి దింపాల‌న్న బ‌ల‌మైన కోరిక బాబు వ్య‌క్తం చేస్తున్నార‌న్న టాక్ టీడీపీలో వినిపిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

తర్వాతి కథనం
Show comments