Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల బైపోల్ : ఎవరికి ఓటేసింది 7 సెకన్లలో తెలుస్తుంది.. ఎలా...?

రాష్ట్రంలో అమితాసక్తిని రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మరికొన్ని గంటల్లో జరుగనుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఈ పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పా

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (10:10 IST)
రాష్ట్రంలో అమితాసక్తిని రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మరికొన్ని గంటల్లో జరుగనుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఈ పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 7 సెకన్లలో ఎవరికి ఓటు వేసిందో ఓటరుకు తెలిసిపోతుంది. 
 
సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గత 20 రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల సందడితో ఎన్నడూ లేనంత బిజీగా కనిపించింది. కానీ, ఈ సెగ్మెంట్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగిసింది. నేతల ప్రచారానికి, మైకుల రణగొణ ధ్వనులకూ బ్రేక్ పడింది. 
 
సోమవారం సాయంత్రం వరకూ వార్డుల వారీగా ఇంటింటికీ తిరిగిన అధికార, విపక్ష ఎమ్మెల్యేలు సాయంత్రం నుంచి ఒక్కొక్కరుగా నంద్యాలను దాటి వెళ్లారు. కిక్కిరిసిన హోటళ్లు ఖాళీ అయిపోయాయి. రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనాలకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కార్ల సందడి తగ్గిపోయింది. గెలుపు తమదేనంటే తమదేనని అధికార, విపక్షాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న విషయమై, పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. అయితే, ఈ నియోజకవర్గ హిస్టరీని ఓసారి పరిశీలిస్తే.. 
 
* రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరుగుతుంది.
* ఓటు వేశాక, ఏడు సెకన్ల పాటు ఏ పార్టీకి ఓటేశామన్న విషయం కనిపిస్తుంది.
* మొత్తం ఓటర్ల సంఖ్య : 2.19 లక్షలు
* నంద్యాల పట్టణంలో 1,42,628 మంది ఓటర్లు.
* రూరల్ నంద్యాలలో 47,386 మంది ఓటర్లు.
* గోస్పాడు మండలంలో 28,844 మంది ఓటర్లు.
* 2,943 మంది రెండు చోట్ల ఓట్లను కలిగివున్నారు.
* ఎన్నికల భద్రత కోసం 82 ప్రత్యేక స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి.
* 255 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్ట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
* నగదు తరలింపు, మద్యం పంపిణీ తదితర ఘటనలపై 368 కేసులు నమోదయ్యాయి.
* ఇప్పటివరకూ రూ.1.16 కోట్ల నగదును సీజ్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments