Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు సలహా ఇచ్చిన టాలీవుడ్ అగ్రహీరో

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (17:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రహీరోగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన అభిమానులతో పాటు యువతకు ఓ మంచి సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి చూస్తూ కాలం వృథా చేయకుండా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలోభాగంగా పలు ప్రాంతాల్లో స్థానికులకు కలివిడిగా మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలు ఉచితంగా ఎల్.ఈ.డి టీవీలను ఆయన ప్రధానం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు దేశానికి గుర్తింపు తెచ్చేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో అంధుల పాఠశాల, నవోదయ స్కూల్ తెచ్చిన ఘనత దివంగత ఎన్.టి.రామారావుకు చెందుతుందన్నారు.
 
ముఖ్యంగా, విద్యార్థులు చదువులపై దృష్టిసారించాలని కోరారు. సోషల్ మీడియా వైపు వెళ్లకుండా మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చూడాలని, ఫేస్‌బుక్ విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం మట్టితో అయినా ఒక్క గుంత పూడ్చిన పాపానపోలేదని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments