అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనే... సీఎం సీట్లో కూర్చునేది చంద్రబాబే

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (17:37 IST)
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దిగజారుడు రాజకీయాలు చేయ‌ద్ద‌ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. టిడీపీకి రెండు సీట్లు వస్తే, చంద్రబాబు ఇంట్లో పాకి పని చేస్తానన్న నారాయ‌ణ‌స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నామ‌న్నారు. అధికారంలోకి రాబోయేది టీడీపీనే అని, మళ్లీ సీఎం సీట్లో చంద్రబాబే కూర్చుంటార‌ని న‌క్కా ఆనంద‌బాబు పేర్కొన్నారు. 
 
నారాయణ స్వామితో పాకి పని చేయించాలనే ఆలోచన జగన్‌కు ఎందుకు వచ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దళితులతో పాకి పని చేయించుకోవడం జగన్‌కు అలవాటేమో గాని, ఆత్మాభిమానం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత దళిత జాతిద‌న్నారు. 
 
దళిత జాతిని అడ్డం పెట్టుకుని, వారితో పనికి మాలిన కామెంట్లు చేయిస్తూ, జగన్‌ రెడ్డి నీచమైన రాజకీయానికి దిగార‌న్నారు. పదవులు శాశ్వతం కాదు, ఆత్మాభిమానంతో ఉండాలని నారాయణ స్వామికి సూచిస్తున్నామ‌న్నారు. నారాయణ స్వామితో ఈ తరహా వ్యాఖ్యలు చేయాలని జగనే ఒత్తిడి తెచ్చి ఉంటార‌ని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments