Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయిల్ కట్టర్‌ను మింగిన ఏడు నెలల చిన్నారి....

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (16:32 IST)
గుంటూరు జిల్లా కేంద్రంలో ఏడు నెలల చిన్నారి ఒకరు ఆడుకుంటూ నెయిల్ కట్టర్‌ను మింగేసింది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు హూటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై తక్షణం స్పందించిన జీజీహెచ్ వైద్యులు అరుదైన చికిత్స ద్వారా నెయిల్ కట్టర్‌ను వెలికి తీసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మౌర్య రాజు, మౌర్య లక్ష్మీ అనే దంపతులు జీవనోపాధి కోసం గుంటూరుకు వలస వచ్చారు. వీరికి రజనీ అనే ఏడు నెలల చిన్నారి ఉంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇతర చిన్నారులు రజనీని ఆడిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నోట్లో నెయిల్‌ కట్టర్‌ పెట్టగా, అదేమిటో తెలియని చిన్నారి దానిని మింగేసింది. ఇతర పిల్లలు ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు చెప్పగా... వారు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై తక్షణం స్పందించిన వైద్యులు.. చిన్నారికి ఎక్స్‌రే, ఇతర వైద్య పరీక్షలు చేసి నెయిల్ కట్టర్‌ ఆహార వాహికలో నుంచి జారి జీర్ణాశయంలోకి చేరినట్లు గుర్తించారు. అయితే తక్షణమే ప్రమాదమేమీ లేదని పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. 
 
శుక్రవారం చిన్నారికి మత్తు మందు ఇచ్చి పీడియాట్రిక్‌ ఎండోస్కోపీ ద్వారా పొట్టలో ఉన్న నెయిల్‌ కట్టర్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం చిన్నారి రజనీని పీడియాట్రిక్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతోందని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments