Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రవణ్‌ను విచారిస్తున్నాం.. పావని దగ్గరు ఇంకా వెళ్లలేదు.. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు

బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య కేసుకు సంబంధించి గల్ఫ్‌లో పనిచేసిన శ్రవణ్ నాలుగు నెలల పాటు వారింట్లో ఉంటూ.. డైట్ కన్సల్టెంట్‌గా హైదరాబాదులో పనిచేస్తున్నాడని.. అతడి పాత్ర ఈ కేసులో ఎంతమాత్రమని ద

Webdunia
శనివారం, 6 మే 2017 (12:09 IST)
బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య కేసుకు సంబంధించి గల్ఫ్‌లో పనిచేసిన శ్రవణ్ నాలుగు నెలల పాటు వారింట్లో ఉంటూ.. డైట్ కన్సల్టెంట్‌గా హైదరాబాదులో పనిచేస్తున్నాడని.. అతడి పాత్ర ఈ కేసులో ఎంతమాత్రమని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. ప్రదీప్ భార్య పావనిని ఇంకా విచారించలేదని సీఐ పి. రాంచందర్‌రావు వివరించారు.
 
ప్రదీప్ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని సీఐ అన్నారు. దర్యాప్తులో భాగంగా అందరి సెల్‌ఫోన్లు సీజ్‌చేసి కాల్‌ డాటా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రదీప్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలిస్తే, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఎమైనా ఉంటే కేసులో చేరుస్తామని చెప్పారు.
 
ప్రదీప్‌ భార్య పావని, కుటుంబ స్నేహితుడు శ్రవణ్‌తో పాటు, బంధువులు, చుట్టుపక్కల వారిని, సహ నటీనటులనూ ప్రశ్నిస్తామని సీఐ చెప్పారు. వీరు కాకుండా ఈ కేసులో ఇంకెవరికైనా సంబంధం ఉందని తెలిసినా వారిని కూడా విచారిస్తామని సీఐ వెల్లడించారు.

ప్రదీప్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలేంటో తెలుసుకునేందుకు విచారణ ముమ్మరంగా జరుగుతుందని.. తమ వద్ద ఉన్న అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి వుందని సీఐ చెప్తున్నారు. ప్రదీప్ కేసు ఇంకా మిస్టరీగానే వుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments