ఖరీదైన కారులో మృతదేహం.. బెజవాడలో మిస్టరీ డెత్ కలకలం!

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఉన్న బెజవాడలో ఓ మిస్టరీ డెత్ ఇపుడు కలకలం రేపుతోంది. ఖరీదైన కారులో ఉన్న ఆ మృతదేహం ఎవరిదన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
విజయవాడలోని డీవీ మ్యానర్ హోటల్ పక్క సందులో ఆగి ఉన్న కారు డ్రైవింగ్ సీటులో కుప్పకూలిన వ్యక్తిని స్థానిక పోలీసులు గుర్తించారు. జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఓనర్‌గా పోలీసులు చెప్తున్నారు.
 
అయితే, మీడియాకు అందిన సమాచారం ప్రకారం మృతుడు తాడిగడప‌కు చెందిన కరణం రాహుల్‌గా భావిస్తున్నారు. ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో మృతదేహం ఉన్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారాల్లో విబేధాలు ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
మిస్టరీ డెత్‌గా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేక హత్య అన్నకోణంలో విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు లేకపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ మిస్సింగ్ కేసు నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments