Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మొదలైన మున్సిపల్ - కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర, పురపాలక సంస్థలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 
 
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
 
మరోవైపు, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు, కుప్పం మునిసిపాలిటీలో 24 వార్డులు, జగ్గయ్యపేట మునిసిపాలిటిలో 31 వార్డులు, కొండపల్లి మునిసిపాలిటీలో 29, పెనుకొండలో 20, రాజంపేటలో 29, కమలాపురం నగర పంచాయతీలో 20, ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తామని, బుధవారం 8 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments