ఆమెకు 35.. ఆయనకు 60.. గట్టిగా పట్టుకుని కిందపడేసి రేప్ చేయబోయాడు... చివరకు...

పొరుగింటిలో నివశించే ఓ మహిళతో కలిసి ఇంట్లోకి వెళ్లిన పక్కింట్లో నివశించే ఓ 60 యేళ్ల వృద్ధుడు అమాంతం పట్టుకుని కిందపడేసి రేప్ చేయబోయాడు. ఈ హఠాత్‌పరిణామం నుంచి తేరుకున్న ఆమె... ఆ కామాంధుడిని గట్టిగా తోస

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (15:27 IST)
పొరుగింటిలో నివశించే ఓ మహిళతో కలిసి ఇంట్లోకి వెళ్లిన పక్కింట్లో నివశించే ఓ 60 యేళ్ల వృద్ధుడు అమాంతం పట్టుకుని కిందపడేసి రేప్ చేయబోయాడు. ఈ హఠాత్‌పరిణామం నుంచి తేరుకున్న ఆమె... ఆ కామాంధుడిని గట్టిగా తోసేసి.. అక్కడ నుంచి తప్పించుకుంది. దీంతో పరువు పోతుందని భావించిన 60 యేళ్ల వృద్ధుడు అపార్ట్‌మెంట్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ముంబై నగరంలోని గోరెగాం ప్రాంతానికి చెందిన సిరిల్ (60) ఏడేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఇతను భార్య, కూతురితో కలిసి ఈ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో నివాసముండేవాడు. ఆదివారం తన పొరుగింట్లో ఉంటున్న 35 ఏళ్ల మహిళ బయటకు వెళ్లి ఇంటికి వస్తూ లిప్టు ఎక్కింది. ఇంతలో పొరుగింటి మహిళతో మాట కలిపిన సిరిల్ ఆమెతో కలిసి లిప్టు ఎక్కాడు. 
 
మహిళ వెంట ఇంట్లోకి ప్రవేశించిన సిరిల్ మహిళను కిందపడేసి అత్యాచారయత్నం చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కొట్టి లైంగికంగా వేధించాడు. అనంతరం మహిళ కేకలు వేస్తూ ఆయన బారినుంచి తప్పించుకొని కిందకు వచ్చి ఇరుగుపొరుగువారికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఇంతలో తప్పించుకున్న సిరిల్ ఇంటి సమీపంలోని షాపింగ్ మాల్‌కు వెళ్లి భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తుండగా సిరిల్ ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. మహిళ కేసు పెట్టి పరువు తీసిందనే భయంతోనే సిరిల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం