Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెత్వానీ కేసు : 16న కుక్కల విద్యాసాగర్‌కు బెయిల్ వచ్చేనా?

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (08:50 IST)
ముంబైకు చెందిన బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ ముగిసింది. తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారంటూ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు ఇటీవల డెహ్రాడూన్‌లో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్‌ను కోర్టులు హాజరుపర్చి న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు ఇవ్వడంతో జైలుకు తరలించారు. ఈ క్రమంలో విద్యాసాగర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ జరపగా, జెత్వానీ తరపున న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు. నిందితుడికి ఐపీఎస్ అధికారులు సైతం సహకరించారని తెలిపారు.
 
తప్పుడు పత్రాలు సృష్టించి జెత్వానీని 42 రోజుల పాటు జైలులో ఉంచారని చెప్పారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా చేస్తారని అన్నారు. నిందితుడు పారిపోయే అవకాశం ఉందని జెత్వానీ తరపున న్యాయవాది శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
 
బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ నెల 16న (రేపు) బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించనుంది. అలాగే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments