Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై నటి కాందబరి జెత్వానీ కేసు : ఏసీపీ - సీఐలపై సస్పెన్ వేటు

kadambari jaitwani

ఠాగూర్

, శనివారం, 14 సెప్టెంబరు 2024 (08:56 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంబంధం ఉన్న పోలీసులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. నాడు కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, విజయవాడ వెస్ట్ జోన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కె.హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. 
 
వైసీపీ నేత కుక్కల విద్యాసా గర్ చేసిన ఫిర్యాదుపై అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఆయన ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం గవర్నరుపేట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. నెల రోజులుగా కాదంబరి జెత్వానీ వ్యవహారం సాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై నుంచి విజయవాడకు వచ్చిన కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేం కుమార్ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. విచారణ చేయడానికి ప్రత్యేకాధికారిగా క్రైమ్స్ ఏసీపీ స్రవంతి నియమించారు. రెండు రోజుల పాటు కాదంబరి కుటుంబ సభ్యులు ఆమెకు వాంగ్మూలం ఇచ్చారు. 
 
అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో నాటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్నీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా కేసు నమోదు చేయించారని కాదంబరి వాంగ్మూలంలో పేర్కొన్నారు. తనను అరెస్టు చేయడానికి విశాల్ గున్నీ నేరుగా ముంబై వచ్చారని ఆరోపించారు. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ మేలు చేయడానికి తనపై అక్రమంగా తప్పుడు కేసు బనాయించారని విజయవాడలో పోలీసు అధికారులకు విన్నవించుకున్నారు. 
 
శుక్రవారం రాత్రి తన న్యాయవాదులతో కాదంబరి, ఆమె తండ్రి నరేంద్రకుమార్, తల్లి ఆశా జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేయించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, సహకరించిన ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీపై ఆమె ఫిర్యాదు చేశారు. న్యాయనిపుణులతో చర్చించి కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 
 
కాదంబరి ఫిర్యాదు చేస్తుండగానే ఈ కేసుకు సంబంధించి అప్పటి పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. కాదంబరి వ్యవహారంలో మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్, ఒక ఎస్ఐ పాత్ర ఉన్నట్టు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. త్వరలో వారిపైనా చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక ఇన్‌స్పెక్టర్ విజయవాడలో, మరో ఇన్‌స్పెక్టర్ ఏలూరు రేంజ్‌లో, ఎస్ఐ కృష్ణా జిల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద‌ళ‌ప‌తి విజ‌య్‌ 69వ చిత్రం ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రకటన