Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల చేతివాటం.. అనర్హులకు వైఎస్ఆర్ చేయూత పథకం..

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంటి వద్దకే మెరుగైన సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే, ఈ వలంటీర్లు పలుప్రాంతాల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ఆ లబ్దిదారుల నుంచి ప్రతిఫలం పొందుతున్నారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వలంటీర్లు ఏకంగా 21 మంది అనర్హులను వైఎస్సార్ చేయూత పథకం కింద ఎంపిక చేశారు. దీంతో ఈ వలంటీర్లపై అధికారులు అనర్హత వేటు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిందీ ఘటన. 
 
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులు. అయినప్పటికీ వివిధ గ్రామాల్లో ఈ పథకానికి అర్హత లేని 21 మందిని వలంటీర్లు నమోదు చేశారు.
 
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు 17 మంది గ్రామ వలంటీర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments