Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబూ చిట్టీ లోకేశం.. నీకిదితగునా.. ట్రాక్టర్ ఎక్కడం వల్ల ఎంత ఘోరం జరిగింది.. సాయిరెడ్డి సెటైర్లు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (11:05 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఉప్పుటేరు కాలువలోకి వెళ్లింది. 
 
అయితే ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్‌‌ను అదుపు చేశారు. దాంతో లోకేశ్‌కు ప్రమాదం తప్పినట్టయింది. లోకేశ్ సురక్షితంగా బయటపడడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటనపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తనదైనశైలిలో సెటైర్లు పేల్చారు. 
 
అయితే, ఈ సందర్భంగా గుంతలో ట్రాక్టర్ చిక్కుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘బాబూ... చిట్టీ (లోకేశం)! ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్‌ గుంతలో పడిందా... లేక నువ్వు ట్రాక్టర్‌ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా? ప్లీజ్‌ చెప్పు!’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు. 
 
కాగా, ఇటీవలి కురిసిన  భారీ వర్షాలకు జిల్లాలోని ఉండి నియోజకవర్గం, సిద్ధాపురం గ్రామంలోని చాకలి పేటలో ఇళ్లు ఇంకా నీట మునిగే ఉన్నాయి. ఇంట్లో అడుగు మేర పేరుకుపోయిన బురద, బయట చెరువును తలపిస్తోంది. రోడ్లపై ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉందని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments