కేసీఆర్ ప్రాణాలకు ముప్పు వుంది.. భద్రతను మరింత పెంచాలి.. రేవంత్

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (16:09 IST)
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, కేసీఆర్‌ను దించి వేయాలని ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలన్నారు. 
 
టీఆర్ఎస్ పార్టీలో భారీ చీలిక వచ్చిందని, కేసీఆర్ ఇంట్లో అర్థరాత్రి పూట ఏమైనా జరగవచ్చని, అల్లుడి నుంచి ముప్పు తగ్గిందని, కుమారుడు కేటీఆర్ నుంచి ఆయనకు ముప్పు ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఇంట్లోనే కేటీఆర్ ఉంటున్నారని, ఆయన్ను ఆ ఇంటి నుంచి పంపించి వేయాలన్నారు.
 
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సీఎం పదవి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతోందని చెప్పారు. కేటీఆర్ సీఎం పదవిని ఆశిస్తున్నారని, వెంటనే ఆయనకు పదవిని ఇవ్వకుంటే ఏదైనా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేటీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి వెంటనే ఖాళీ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు భద్రతను మరింత పెంచాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments