Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీ రూపంలో కొలువైన హనుమాన్ గుడి..కోరినవన్నీ నెరువేరుతాయి...(Video)

స్త్రీ రూపంలో కొలువైన హనుమాన్ గుడి..కోరినవన్నీ నెరువేరుతాయి...(Video)
, శుక్రవారం, 3 జనవరి 2020 (11:55 IST)
శ్రీరాముడికి పరమ భక్తుడిగా, ఆజన్మ బ్రహ్మచారిగా, ధైర్యసాహసాలుగా పెట్టింది పేరుగా ఉన్న దేవుడు హనుమాన్. భక్తులకు ఎల్లప్పుడూ అభయమిచ్చి, ధైర్యం నింపే ఆంజనేయుడికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని పురాతనమైనవైతే మరికొన్ని ఆ తర్వాత భక్తులు నిర్మించినవి. 

కానీ హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించే పురాతన దేవాలయం ఒకటి ఉందని చాలామందికి తెలియదు. ఈ ఆలయం ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్‌లో ఉంది. ఆ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడి ప్రజలకు అపారమైన విశ్వాసం.
 
రతన్ పూర్ రాజు అయిన పృధ్వీ దేవ్ రోజూ క్రమం తప్పకుండా హనుమంతుడికి పూజలు నిర్వహించేవాడు. అయితే ఆయన కుష్టు వ్యాధికి గురై తీవ్ర నిరాశ నిస్పృహలో మునిగిపోయినప్పుడు హనుమంతుడు ఆయన కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు. ఆ విధంగా ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు.

ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని రోజులు ఉందనగా మళ్లీ కలలో కనిపించిమహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దానిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని ఆదేశిస్తాడు.

ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటంతో మొదట ఆశ్చర్యపోయినా తనకిచ్చిన ఆదేశం మేరకు ఆలయం లోపల ప్రతిష్ట చేస్తాడు. వెంటనే రాజుకు వ్యాధి నయమైపోతుంది. హనుమంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్న రాజు తనలాగే ఈ ఆలయాన్ని దర్శించే వారి కోరికలు తీరాలని వేడుకుంటాడు.
 
విమాన మార్గంలో ఆ ఆలయాన్ని చేరుకోవడానికి రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్. అక్కడి నుండి 140 కి.మీలు దూరంలో ఉన్న బిలాస్‌పూర్‌కు బస్సు లేదా క్యాబ్‌లో చేరుకోవచ్చు, అక్కడి నుండి రత‌న్‌పూర్‌కు 28 కిలోమీటర్లు. రైలుమార్గంలో చేరుకోవాలంటే సమీప రైల్వే స్టేషన్ బిలాస్ పూర్ జంక్షన్. అక్కడి నుండి రతన్‌పూర్ 25 కిలోమీటర్లు, స్టేషన్ బయట క్యాబ్, బస్సులు అందుబాటులో ఉంటాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-01-2020 శుక్రవారం మీ రాశిఫలాలు - నూతన పరిచయాలు..