సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ ఫైర్.. సిగ్గు అనిపించట్లేదా?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (12:21 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణమరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామతీర్థం ఘటనపై కృష్ణమరాజు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగితే సిగ్గనిపించడంలేదా? అంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌కు హిందువులంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. కొంతమంది చేస్తున్న వికృతి క్రీడ ఇలాగే కొనసాగుతుందంటే.. దీని వెనుక ఎవరైన పెద్దల హస్తముందా? అనే అనుమానం కలుగుతుందని, ఆ పెద్దలు ఎవరని ప్రశ్నించారు.
 
ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడంలేదా? అని రఘురామకృష్ణమరాజు అన్నారు.
 
శ్రీరాముడంటే ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఎన్నో విగ్రహాలకు కాళ్లు, చేతులు నరికారని, ఇప్పుడు ఏకంగా శ్రీరాముడి తల నరికి ఎత్తుకెళ్లడమంటే ఇది హిందూ సమాజం మీద చేస్తున్న దాడిగానే భావిస్తున్నామని రఘురామ కృష్ణమరాజు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments