Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై భీమ్ సినిమాలో చూపించినట్లే నన్ను కూడా హింసించారు...

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (10:23 IST)
కస్టడీలో తనను హింసించడంపై దర్యాప్తు కోరినా ఇప్పటివరకు దిక్కులేదని నరసాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లే తనను కూడా పోలీసులు హింసించారని ఆయన చెప్పారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లే తనకు కూడా పోలీసులు న‌ర‌కం చూపించారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 
కస్టడీలో తనను హింసించడంపై దర్యాప్తు కోరినా ఇప్పటివరకు చ‌ర్య‌లు లేవ‌ని వాపోయారు. ఎంపీకే దిక్కు దంటే లోపం ఎక్కడుందని ఆయ‌న ప్రశ్నించారు. కేంద్రం పిలుపుతో చాలా రాష్ట్రాలు పెట్రో పన్నులను తగ్గించాయ‌ని, ఆ దిశగా ముఖ్యంత్రి జగన్ చర్యలు తీసుకోకపోవటం శోచనీయమన్నారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇంధనం రేట్లు, స్కూల్‌ ఫీజులు, ఇంటి పన్నులు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ మాట్లాడారని గుర్తు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో సీఎం జగన్‌.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు అమలవుతున్నాయని ఎద్దేవా చేశారు. 
 
 
గతంలో ఆయన చెప్పినట్లు.. యానాం, కర్ణాటక, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఏపీ కంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. అప్పుడు ప్రజల కోసం ధరలు తగ్గించాలని కోరారని.., ఇప్పుడు అమలు చేసేందుకు వెనకాడుతున్నారని రఘురామ మండిపడ్డారు.  ఇంధన ధరల తగ్గింపు విషయంలో కర్ణాటక సీఎం బొమ్మై గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారని.., అదే తరహాలో ఏపీలో కూడా రేట్లు తగ్గించి దేశ వ్యాప్తంగా జగన్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
 
మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులు ఎందుకు అమలు చేయటం లేదని రఘురామ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపుల విషయంపై ప్రధానికి లేఖ రాశానని వెల్లడించారు. మద్యం షాపుల నుంచి వచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని..ఆ డబ్బు ఎవరికో ఇస్తున్నారని విమర్శించారు. మద్యం షాపుల నుంచి నగదు రూపేణా వసూలు చేస్తున్న దానిలో ప్రభుత్వానికి ఎంత జమ చేస్తున్నారో లెక్క తేలటం లేదన్నారు. ఎవరైనా తమ జేబులో వేసుకుంటున్నారనే అనుమానం అందరికీ కలుగుతోందన్నారు. తక్షణమే నగదు వసూలు ఆపి డిజిటల్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments