Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో టీకాల కొరతకు ప్రధాని మోడీ సర్కారే కారణం : ఆర్కే రోజా

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (13:16 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు కొరత ఏర్పడటానికి మోడీ సర్కారే కారణమని ఆమె ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండకుండా... హైదరాబాదులో కూర్చొని ప్రెస్మీట్లు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం దారుణమని మండిపడ్డారు. 
 
రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందలేదని... దీనికి ప్రధాని మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్ పంపించాలని ప్రధాని మోడీకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదని విమర్శించారు. 
 
రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడం లేదన్నారు. విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నారా లోకేశ్‌పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఆయన మాదిరే చవటలా తయారవ్వాలని లోకేశ్ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments