Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీగా నారా లోకేష్.. ఆ తర్వాత ఏపీ కెబినెట్ మంత్రి కూడా?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శాసనమండలి సభ్యుడు కావడం తథ్యమైపోయింది. తన కుమారుడిని ఎమ్మెల్సీ చేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (14:41 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శాసనమండలి సభ్యుడు కావడం తథ్యమైపోయింది. తన కుమారుడిని ఎమ్మెల్సీ చేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలికి పంపించాలని ఆదివారం పొలిట్ బ్యూరో సూచించింది.
 
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం దాదాపు 3 గంటలపాటు సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు నేతలు లోకేష్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌ను ఎమ్మెల్సీగా చేయాలని చంద్రబాబుకు సూచించారు. నేతల ఒత్తిడితో చంద్రబాబు సూచన ప్రాయంగా సమ్మతం తెలిపినట్టు తెలుస్తోంది. 
 
నారా లోకేశ్‌ను ఎమ్మెల్సీగా తీసుకోవడంపై చర్చ జరిగిన నేపథ్యంలో... ఆయన మంత్రివర్గంలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అనేకంగా ఆయనకు ఐటీ శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే లోకేశ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసేందుకు తెదేపా సన్నాహాలు చేస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments