Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశ్నిస్తానన్న మొనగాడు పత్తాలేకుండా పోయాడు: పవన్‌పై రోజా విమర్శలు

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. రబ్బర్‌ సింగో, గబ్బర్‌ సింగో.. ప్ర‌శ్నిస్తాన‌న్న మొనగాడు ఇప్పుడెక్క‌డున్నాడు? పత్తాలేకుండా పారిపోయాడంట

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (10:32 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. రబ్బర్‌ సింగో, గబ్బర్‌ సింగో.. ప్ర‌శ్నిస్తాన‌న్న మొనగాడు ఇప్పుడెక్క‌డున్నాడు? పత్తాలేకుండా పారిపోయాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో గురువారం జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... కాపులను ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే పవన్ ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఆమె నిలదీశారు. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌న‌ని చెప్పుకున్న జ‌న‌సేనాని ఇప్పుడు జీఎస్టీ వ‌ల్ల ప‌డ‌బోతున్న ప‌న్నుపోటు గురించి ఎందుకు అడ‌గ‌డం లేద‌ని ఆమె విమ‌ర్శ‌లు చేశారు. 
 
మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నేత‌లపై కూడా రోజా నిప్పులు చెరిగారు. గిరిజ‌నుల‌ ఓట్ల కోసం కొండలు ఎక్కి వారిని క‌లిసే రాష్ట్ర‌మంత్రులు.. ఇప్పుడు గిరిజ‌నుల ఆరోగ్యాలు పాడైపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. 
 
పరిపాలనకు మానవత్వాన్ని జోడించి మహానేత వైఎస్‌ చేసిన పాలన చరిత్రగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టే ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలుపుకోలేదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments