రాజీనామాకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే రోజా.. కారణం ఏంటంటే?

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (18:10 IST)
నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు సొంత నేతల ద్వారానే ఇంటి పోరు తప్పట్లేదు. రోజాను తప్పించేందుకు నగరి వైకాపా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ఆవేద‌న‌కు గురైన ఫైర్ బ్రాండ్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధ‌మని వార్తలు వస్తున్నాయి. అలాగే రోజా అసంతృప్తికి మరో కారణం కూడా వుంది. అదేంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మ‌న్ నియామ‌క‌మే.
 
తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియ‌మించారు సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అయితే, ఈ వ్య‌వ‌హారం రోజాకు మింగుడుప‌డ‌డం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వ‌హించారు. కాగా, స్థానిక ఎన్నికల్లో రోజా, చక్రపాణిరెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది.
 
తాజాగా, ఆయ‌న‌కు ప‌ద‌వి రావ‌డంపై ఆవేద‌న‌కు గురైన రోజా.. ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

తర్వాతి కథనం
Show comments