Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలువగలవా బాబూ? రోజా ప్రశ్న

Advertiesment
MLA Roja
, ఆదివారం, 9 జనవరి 2022 (22:28 IST)
కుప్పం వేదికగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసిపి నేతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చిత్తూరు జిల్లాకు వచ్చి మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్సలు చేశారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలు వైసిపి నాయకులకు కోపాన్ని తెప్పిస్తోంది. ఎమ్మెల్యే రోజా చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.

 
తిరుమల శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడారు. కుప్పంలో మళ్ళీ గెలుస్తానన్న నమ్మకం ఉంటే చంద్రబాబు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్థమని టిడిపి ప్రగల్భాలు పలకడం కాదని, దమ్ముంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సిఎం జగన్ చంద్రబాబుతో సహా అందరి సరదా తీర్చేస్తారని ఎద్దేవా చేశారు.

 
స్థానిక ఎన్నికల్ల ఘోర పరాజయంతో చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతురన్నారు. 30 యేళ్ళ తరువాత కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబుకి తెలిసి వచ్చిందా అని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు ఎన్ని విమర్సలు, ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చింది: భాజపా ఎమ్మెల్సీ మాధవ్