Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఫ్లాప్ షో...పిచ్చికి ప‌రాకాష్ట‌... పార్థసారథి ఫైర్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:45 IST)
పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు  పార్థసారథి అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు చిరంజీవి పేరుతో పైకి వచ్చి, ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. మీ నాన్న మీకు ఏమిచ్చారో, ఇవ్వలేదో మాకైతే తెలియదు కానీ... పవన్‌కు ఇటువంటి పిచ్చి ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు.

నీ మాటలు పిచ్చితనంగా ఉన్నాయి, ఎక్కడా రాష్ట్రానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించికానీ దిక్సూచీలా లేవు. నీ మైండ్‌లో రాష్ట్ర ప్రజల పట్ల అవగాహన ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. కేవలం పిచ్చి ఒక్కటే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కావాలని ఆశలు, కలలుకంటున్న వ్యక్తి భావజాలం, ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్‌ ఏంటో ప్రజలకు బాగా అర్థమైంద‌న్నారు. 
 
పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి కొత్త ఫిలాసపీ తెచ్చారు. వైయస్సార్‌ సీపీకి కమ్మవారు వర్గ శత్రువులు అట. పవన్‌ ఈ సమాజాన్ని ఏ దిశగా తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. అంటే లేని వర్గ శత్రువును సృష్టించి, వర్గాల మధ్య పోరు సృష్టించి ఆ వివాదాల నుంచి రాజకీయ లబ్ది పొందాలనుకుంటే నీకు ఏం శిక్ష వేయాలో ప్రజలకు తెలుసు. వర్గ శత్రువును చూసి కాదు జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి 151 సీట్లు ఇచ్చింది. కమ్మవారు వైయస్సార్‌ సీపీకి ఎట్టి పరిస్థితుల్లో వర్గ శత్రువులు కాదు.

ఈ  ప్రభుత్వంలో, మంత్రివర్గంలో కూడా ముఖ్యభూమిక వహిస్తున్నవారిలో కమ్మవారు ఉన్నారు. సాక్షాత్తూ సీఎం అసెంబ్లీ హాల్‌లోనే చెప్పారు. కొడాలి నాని, తలశిల రఘురాం లాంటి ఎందరో తన వెన్నంటే ఉన్నారని చెప్పారు. జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చింది నీవు అనుకుంటున్నట్లు పిచ్చితనంతో కాదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం అమలవుతుందనే.

"జగన్‌ మోహన్‌ రెడ్డిగారి కుటుంబం ఏదైనా మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. మా పిలల్ల భవిష్యత్‌ బాగుంటాయనే ఉద్దేశంతో"  ప్రజలు అధికారాన్ని ఇచ్చార‌ని సార‌ధి మండిప‌డ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments