Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందు అలాంటివారికే పంపిణీ చేస్తాం : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (08:17 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా బాధితులకు ఇచ్చే మందు ఈ నెల 7వ తేదీ నుంచి తిరిగి పంపిణీ చేయనున్నారు. ఈ మందు పంపిణీకి ఏపీ హైకోర్టుతో పాటు.. ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మందు పంపిణీ విధివిధానాలపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
 
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ మందును వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరణ పద్ధతిలో పంపిణీ చేస్తామని, అది కూడా ఆన్‌లైన్‌లో  బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మందును పోస్టు, కొరియర్ సేవల ద్వారా కూడా అందిస్తామన్నారు. 
 
అయితే, కరోనా సోకిన వారికే తొలి ప్రాధాన్యత అని, మందును మొదట వారికే అందిస్తామని కాకాని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంలో, కరోనా రాకుండా మందు ఇవ్వనున్నట్టు వివరించారు. ఆన్‌లైన్ విధానంలో మందు పంపిణీ చేస్తున్నందున, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
 
ఆనందయ్య మందు పంపిణీపై చర్చించేందుకు మంగళవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ హాజరయ్యారు. వీరంతా మందు పంపిణీ విధానంపై సుధీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments