Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ-హెచ్ విద్యార్థి...

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (13:00 IST)
విశాఖపట్టణం సముద్రంలో దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కార్తీక్ (21)గా గుర్తించారు. హైదరాబాద్ - ఐఐటీలో విద్యాభఅయాసం చేస్తున్నాడు. విశాఖ సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతదేహం కేజీహెచ్‌కు తరలించారు. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
 
కార్తీక్ గత ఎనిమిది రోజుల నుంచి కనిపించడం లేదనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్ (మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో 19వ తేదీన కార్తీక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థి విశాఖపట్నం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతవారం రోజులుగా పలు ప్రాంతాల్లో కార్తీక్ ఆచూకీ కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొ. మూర్తి ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖపట్నానికి పంపించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం విద్యార్ధి మృతదేహం లభ్యమైంది. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

సామాన్యులే సెలబ్రిటీలుగా డ్రింకర్ సాయి టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments