Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్‌కు విగ్రహమా? అలాచేస్తే కేసు వేస్తానంటున్న అమృత

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన దళిత వర్గానికి చెందిన ప్రణయ్‌కు కొందరు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ వార్త మిర్యాలగూడలో సంచలనంగా మారింది.

Miryalaguda
Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (09:41 IST)
మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన దళిత వర్గానికి చెందిన ప్రణయ్‌కు కొందరు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ వార్త మిర్యాలగూడలో సంచలనంగా మారింది. దీంతో మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదంటూ స్థాని డీఎస్పీ, మున్సిపల్, ఎమ్మెల్యే కార్యాలయాల్లో కొందరు వినతిపత్రాలు సమర్పించారు. అయితే, తన భర్తకు మిర్యాలగూడలో విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత డిమాండ్ చేస్తోంది.
 
ఇకపోతే, తనను, తమ ప్రేమను అవమానపరిచేలా పోస్టులు పెడితే కేసులు పెడతానంటూ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత హెచ్చరించింది. ప్రణయ్‌తో ప్రేమ మొదలు.. హత్య దాకా జరిగిన అన్ని పరిణామాల్లోనూ అంతా ఆమెనే తప్పుబడుతూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 
 
వీటిపై ఆమె స్పందిస్తూ, అలాంటి పోస్టింగ్‌లు పెట్టేవారిపై కోర్టులో కేసులు వేస్తానని గద్గద స్వరంతో హెచ్చరించింది. అటు ఆమె అత్తమామలు, స్నేహితులు కూడా ఈ కామెంట్ల పరంపరపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమృత సమస్యను రెండు కులాలకు చెందిన అంశంగా ముడిపెట్టి విచ్చలవిడిగా సోషల్‌మీడియాలో చర్చ చేయడాన్ని కొందరు సామాజికవాదులు ఖండిస్తున్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments