Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ సాయంతో బాలికపై అత్యాచారం.. ఆర్నెల్ల గర్భవతిని చేసిన కామాంధుడు

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (12:11 IST)
ఓ మహిళ పాడుపనికి పాల్పడింది. కామాంధుడుకి తనవంతు సహకారం అందించింది. మైనర్ బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు.. ఆ మహిళ సాయంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఫలితంగా ఆ బాలిక ఇపుడు గర్భందాల్చింది. ఆమెకు ఆర్నెల్లు. ఈ విషయం బాధితురాలి తండ్రి మంగళవారం జిల్లా అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒంగోలు జిల్లా కొమరోలు మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక అక్కడి కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతూ వస్తోంది. అయితే, కరోనా వైరస్ కారణంగా బడులు లేకపోవడంతో ఇంటివద్దే ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కాశీరావు అనే వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు. ఇందుకోసం మరో మహిళ సాయం తీసుకున్నాడు. ఆ మహిళ ద్వారా బాలికను ఇంటికి పిలిపించుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది.
 
ఈ విషయం తెలుసుకున్న కాశీరావు.. తన స్నేహితుడు విశ్వరూపం అనే వ్యక్తి ద్వారా సుభానీ అనే ఆర్‌ఎంపీ వద్దకు దీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. కుమార్తె అనారోగ్యంగా ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఓ ఆస్పత్రిలో బాలికకు గర్భం తీసేసిన విషయం గుర్తించారు. బాధిత బాలికను బంధువులు గట్టిగా నిలదీయడంతో ఆమె విషయం చెప్పింది. 
 
దీంతో బాలిక తండ్రి నేరుగా జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. పైగా, నిందితులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీనిపై అదనపు ఎస్పీ రవిచంద్ర స్పందిస్తూ ఫిర్యాదుపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ మార్కాపురం డీఎస్పీని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం