Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి ఉషశ్రీ కోసం సంబరాలు.. ఏడు నెలల చిన్నారి ప్రాణాలు?

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (22:23 IST)
usha sree
అనంతపురం జిల్లాలో ఏడు నెలల చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనారోగ్యంతో వున్న ఏడు నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న వాహనాన్ని ఆపివేయడమే ఇందుకు కారణమని.. అదీ కూడా అనంత, కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ కోసం ఏర్పాటు చేసిన స్వాగత సంబరాలే ఈ ఘటనకు కారణమైందని తెలుస్తోంది. దీంతో, ఆస్పత్రికి వెళ్లేసరికి పాప ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచినట్లు వార్తలు వస్తున్నాయి.
 
వివరాల్లోకి వెళితే.. శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన.. ఈరక్క, గణేష్‌ల కూతురు పండు అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా అంబులెన్స్‌ రాలేదు. దీంతో బైక్‌పై కళ్యాణదుర్గం తీసుకెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 
ఎంతకీ వదలక పోవడంతో చిన్నారి రోడ్డుపైనే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను అడ్డుకోవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు చిన్నారి తల్లిదండ్రులు. 
 
ఈ విషయంలో పోలీసుల వెర్షన్‌ మరోలా ఉంది.. మంత్రి స్వాగత సంబరాల సందర్భంగా.. తామెక్కడా వాహనాలను ఆపలేదంటున్నారు ట్రాఫిక్‌ జామ్‌ వల్లే చిన్నారి మృతి చెందిందనడంలో వాస్తవం లేదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments