Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ళనొదిలి నన్ను పట్టుకుంటారేంటి... మీడియాపై మంత్రి చిందులు

ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం హీటెక్కుతోంది. అధికార టీడీపీ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏ నిమిషమైనా తెగిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావి

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:35 IST)
ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం హీటెక్కుతోంది. అధికార టీడీపీ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏ నిమిషమైనా తెగిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా బీజేపీ వారే తెదేపా నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 
 
మొదట్లో సోము వీర్రాజు, ఆ తర్వాత దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ మాధవన్ అలా మరికొందరు ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించి మంత్రిగా ఉన్న ఒక్క వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం తెదేపా నేతలపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అంతేకాదు మీడియా కనిపిస్తే భయపడిపోతున్నారాయన. మీడియా అడిగే ప్రశ్నలకు ఎక్కడ ఇరుక్కుంటామేమోనన్న భయం మంత్రిలో కనిపిస్తోంది. 
 
అందుకే తిరుపతిలో పర్యటించిన మంత్రి కామినేని మీడియా ప్రతినిధులు దణ్ణం పెట్టేశారు. మాణిక్యాలరావు మాట్లాడినా, సోము వీర్రాజు మాట్లాడినా, లేదా ఇతర బీజేపీ నేతలు ఎవరు మాట్లాడిన.. వారినే మీరు వారినే అడగాలి. మమ్మల్ని కాదు అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. "నాకు తెలిసినంత వరకు నాలుగేళ్ళపాటు టీడీపీ-బీజేపీల స్నేహబంధంలో ఏపీ అభివృద్ధి పథంలో నడిచిందన్న నమ్మకం ఉంది. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుంది. వారు ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మంత్రి కామినేని శ్రీనివాస్ వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments