Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోతే.. వెంట్రుక పోతుంది.. వాళ్లకు బోడిగుండు అవుతుంది : మంత్రి మాణిక్యాల రావు

చెందిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రిగా ఉన్న మాణిక్యాల రావు (బీజేపీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తన మంత్రి పదవికి సెకనులో రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Advertiesment
పోతే.. వెంట్రుక పోతుంది.. వాళ్లకు బోడిగుండు అవుతుంది : మంత్రి మాణిక్యాల రావు
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (10:07 IST)
చెందిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రిగా ఉన్న మాణిక్యాల రావు (బీజేపీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తన మంత్రి పదవికి సెకనులో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు అంశంపై సోమవారం వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మంత్రి ఆయన మాట్లాడుతూ, 'మేం ఇక్కడ(ఏపీలో) వెంట్రుకలాంటి వాళ్లం.. కొండకు వెంట్రుక కట్టి లాగుతున్నాం.. వస్తే కొండ వస్తుంది.. పోతే.. వెంట్రుక పోతుంది.. వాళ్ల(టీడీపీ)కు గుండు అవుతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
అయితే, తెలుగుదేశం పార్టీతో ఉన్న స్నేహాన్ని తెంచుకునే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. పొత్తు విషయం తమ పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. బీజేపీతో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో మూడు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయని, టీడీపీతో తెగతెంపులు చేసుకునే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. 
 
రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం గురించి ప్రజలకు చెప్పుకోవడంలో తాము విఫలమయ్యామన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం సాయం చేసింది.. ముందు తమ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తామని.. సభలు పెట్టి ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఎన్డీయేలో బలమైన మిత్రపక్షం టీడీపీయేనని.. వాళ్లను వదులుకోవాలనుకోవడం లేదని.. వాళ్లు వెళ్లిపోయినా కేంద్రంలో తమ ప్రభుత్వం ఏమీ పడిపోదని మంత్రి మాణిక్యాల రావు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయంత్రం పెళ్లి.. సెల్ ఫోన్‌ చూస్తూ.. రైల్వే ట్రాక్ దాటాడు.. క్షణాల్లో?