Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల్ని పిచ్చోళ్ళను చేయొద్దు.. విడిపోయి కొట్టుకోండి: తమ్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. కాదు కాదు.. నిధులు ఇచ్చామని బీజేపీ నేతలు చెప్తున్నారు.. ఇందులో ఏది నిజం.. ప్రజలను పిచ్చోళ్ళను చేయకుండా నిజానిజాలేంటో చెప్పండి అంటూ

Advertiesment
Tammareddy Bharadwaj
, శనివారం, 17 ఫిబ్రవరి 2018 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. కాదు కాదు.. నిధులు ఇచ్చామని బీజేపీ నేతలు చెప్తున్నారు.. ఇందులో ఏది నిజం.. ప్రజలను పిచ్చోళ్ళను చేయకుండా నిజానిజాలేంటో చెప్పండి అంటూ ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు విమర్శలు గుప్పించారు. టీడీపీ-బీజేపీ నేతల వ్యవహారం ఏంటో అర్థం కాకుండా ప్రజలు తికమకపడుతున్నారనే విషయాన్ని తమ్మారెడ్డి గుర్తు చేశారు. 
 
గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ టీడీపీ-బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు.. విమర్శలు ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయని తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ఇంకా ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రజలను తికమకపెట్టొద్దని.. విడిపోయి కొట్టుకోండి అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వుండే పార్టీకి చెందిన వారు ఒకరినొకరు తిట్టుకుని.. టీవీ ఛానల్స్‌లో అల్లరి చేస్తున్నారని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారా? లేకుంటే జనాలు పిచ్చోళ్లని అనుకుంటున్నారా..? అసలు నిజాలేంటో చెప్పండంటూ తమ్మారెడ్డి డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి చేసుకుని ప్రియుడితో పరార్... ఒకటిన్నర సంవత్సరంగా సహజీవనం... ఆ తర్వాత?