Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వ్యాఖ్యలే కొంపముంచాయ్.. మేకపాటి.. టీడీపీలోకి జంప్ అవుతారా?

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కొంపముంచాయని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఓ టీవీ ఛానల్‌కి

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (12:14 IST)
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కొంపముంచాయని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప ఎన్నికల ప్రచారం సాగుతున్న వేళ జ‌గ‌న్ వ్యాఖ్య‌లే చేటుతెచ్చాయని మేకపాటి అన్నారు. 
 
తాను జగన్ ప్రసంగం చూశానని.. అది చాలా ఆకట్టుకునేలా వుంది. కానీ చివర్లో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. అలాగే శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డితో స‌భాముఖంగా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయించ‌డం, ఇత‌ర ప్ర‌సంగాలు ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుని పోయాయి. కానీ చివ‌ర్లో చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేశాయన్నారు.
 
అలాగే ప్ర‌చారంలో తాము ప‌డిన క‌ష్ట‌మంతా, జ‌గ‌న్ వ్యాఖ్య‌ల వ‌ల్లే వృధా అయింద‌ని మేక‌పాటితో పాటు పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు కూడా చర్చించుకుంటున్నట్లు స‌మాచారం. అయితే ఎంపీ రాజమోహన్ రెడ్డి దీని గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మేకపాటి కూడా వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments