Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ శంకర్ మాస్టర్ ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు రూ.3 ల‌క్ష‌లు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (19:15 IST)
శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల సాయం  అందించారు. ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వ‌గా, ఆయ‌న‌కు ఎక్క‌డో ఉన్న బాలీవుడ్ న‌టుడు సంఘీభావం తెలిపారు. కానీ, ఇక్క‌డున్న తెలుగు న‌టులు మాత్రం కేవలం ట్వీట్ ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో మెగాస్టార్ ముంద‌డుగు వేశారు. 

 
కరోనా బారిన పడి గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స  పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్ద కుమారుడికి సైతం వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా, సతీమణి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంలో మాస్టర్‌ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్, ధనుష్‌ తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కానీ, ఇక్క‌డ మాత్రం తెలుగు హీరోల‌లో ఎలాంటి స్పంద‌నా లేదు. మంచు విష్ణు మా అధ్య‌క్షుడైనా, కేవ‌లం ట్వట్ ల‌తో, ఫోన్ కాల్ తో కాల‌క్షేపం చేస్తున్నారు.


కానీ, ఆపద అంటూ వస్తే, నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్  చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. శివ‌శంక‌ర్ కుటుంబానికి 3 ల‌క్ష‌ల చెక్కు అందించ‌డంతో వారు చిరంజీవికి కృత‌జ్న‌త‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments