Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ: ప్రముఖులతో సందడిగా మారిన తిరుపతి

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (22:09 IST)
తిరుపతిలో సందడి నెలకొంది. తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్నెంట్ గవర్నర్లు తిరుపతికి వస్తుండడంతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 
 
తిరుపతిలోని తాజ్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. ప్రముఖులందరూ బస చేసేలా తాజ్ హోటల్‌ను సిద్ధం చేశారు. మొత్తం 70 మంది ప్రముఖులు సమావేశానికి హాజరవుతున్నారు. ఈరోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి చేరుకున్నారు. 
 
రేపు మధ్యాహ్నం తాజ్ హోటల్లో సమావేశం జరుగనుంది. అమిత్ షో ఈరోజు సాయంత్రం తిరుపతి లోనే బసచేసి రేపు ఉదయం నెల్లూరుకు బయలుదేరి వెళతారు. రేపు మధ్యాహ్నం నెల్లూరు నుంచి తిరుపతికి చేరుకొని దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొననున్నారు.
 
ఆ తర్వాత అమిత్ షా తిరుమలకు చేరుకుని 15వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈరోజు సాయంత్రం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రికి ఘన స్వాగతం పలకనున్నారు. తిరుపతిలో రేపు జరిగే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనే నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు 
 
భారత ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ, జాయింట్ సెక్రెటరీ రుబీనా ఆలీ, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌లు చేరుకున్నారు. వీరికి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మీటింగ్‌కు వచ్చే ప్రముఖులకు తిరుచానూరులోని గ్రాండ్ రిడ్జ్‌లో బస ఏర్పాట్లు చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments