Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు శ్వేత లొంగుబాటు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (08:42 IST)
మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న కొర్రా కుమారి ఎలియాస్ శ్వేత విశాఖపట్నం జిల్లా ఎస్పీ బీ. కృష్ణారావు సమక్షంలో లొంగిపోయారు.దాదాపు 11 ఏళ్లుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న కుమారి తన కుటుంబసభ్యులతో కలిసి జీవించాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఆమె స్వచందంగా లొంగిపోయినట్లు విశాఖలో ఏర్పాటుచేసిన చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు.

ఈ సందర్భంగా  కొర్రా కుమారిని  మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.  విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన జీకే వీధి మండలం, మెట్టగూడ గ్రామానికి చెందిన కుమారి మావోయిస్టుల విప్లవ గీతాలు, సమావేశాలకు ఆకర్షితురాలైన కుమారి  ఆ భావజాలానికి ఆకర్షితులై 2010లో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. 2009వ సంవత్సరంలో గాలికొండ దళ కమాండర్ కృష్ణ మరియు వసంతల ప్రోద్బలంతో  మిలిషియాగా చేరిందని, 2010లో దళం మెంబర్ గా చేరినట్లు తెలిపారు.

2015లో ఏ.సీ.ఎం.గా పదోన్నతి పొంది ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో కొనసాగినట్లు తెలిపారు.కుమారి మొత్తం 46 నేరాల్లో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. 6 హత్యలు, 2 మందుపాతరలు పేల్చిన ఘటనలు, 3 ఆస్తుల ధ్వంసం ఘటనలు, 2 కిడ్నాప్ సంఘటనల్లో ఆమె ప్రమేయం ఉందని చెప్పారు.

11 సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉన్న కుమారి.కుటుంబసభ్యులతో కలిసి జీవించాలనే ప్రధాన కారణం మరియు పోలీసుల విస్తృతమైన కూంబింగ్‌,ఆదివాసీల క్యాడరుపై మైదాన ప్రాంత నాయకుల వివిక్ష,ఇటీవలి ఎన్కౌంటర్ లలో సహచర మావోయిష్టులు పెద్ద సంఖ్యలో మరణించడం తదితర కారణాలతో  లొంగిపోయినట్లు ఎస్పీ బీ. కృష్ణారావు తెలిపారు.

ఆమెపై నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉందని ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ బీ. కృష్ణారావు తెలిపారు.ఈ సమావేశంలో సీఆర్పీఎఫ్ 198  బీఎన్ కమాండెంట్ కవీంద్రకుమార్ చంద్,సీఆర్పీఎఫ్ 234  బీఎన్ కమాండెంట్ సంజీవకుమార్ ద్వివేది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments