Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌న్యం పర్యాటక ప్రాంతాల‌లో మందు తాగి అల్ల‌రి చేస్తే ఖ‌బ‌డ్డార్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:44 IST)
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మారేడుమిల్లి, గుర్తేడు పోలీస్‌స్టేషన్లలో దస్త్రాలను పరిశీలించారు.
 
 
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల సందర్భంగా మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. అతిథిగృహాలు, రిసార్టులపైనా పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అవసరమైతే పండగల సమయాల్లో తాను మారేడుమిల్లిలోనే బస చేస్తానన్నారు. మారేడుమిల్లి ఇన్‌ఛార్జి సీఐ త్రినాథ్‌, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రామకృష్ణ, సతీశ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments