Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఆరోపణను నిరూపించినా రాజకీయ సన్యాసం స్వీకరిస్తా... తెదెపాకి ఆర్కే సవాల్

Webdunia
సోమవారం, 8 జులై 2019 (18:39 IST)
"ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను టీఆర్ఎస్ నుంచి రూ.100 కోట్లు తీసుకోలేదు. టీడీపీ నేతలు నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నేను టీఆర్ఎస్ నుంచి రూ.100 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా" అని మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు.

టీడీపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను లంచాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నేతలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

‘చంద్రబాబు, లోకేశ్ లను నేను డైరెక్టుగా అడుగుతున్నా.. మీ ఇల్లు అక్రమమా? సక్రమమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓ బీసీ మహిళ(పంచుమర్తి అనురాధ)ను అడ్డు పెట్టుకుని ఆమెతో నాపై విమర్శలు చేయించడం పద్దతి కాదు. ధర్మం కాదు అని తెలియజేస్తున్నా’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments