Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌లో మాట్లాడుతూ.. బావిలో పడిపోయాడు.. 17 గంటలు అక్కడే వుండిపోయాడు..

Webdunia
శనివారం, 3 జులై 2021 (08:47 IST)
చేతిలో ఫోన్ వుంటే చాలు. చాలామంది చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎక్కడున్నామనే విషయాన్ని మరిచిపోతుంటారు. తాజాగా ఓ వ్యక్తి తాను ఫోనులో మాట్లాడుతూ బావి పక్కన వున్నామనే విషయాన్ని మరిచిపోయాడు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. 
 
రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో అటుగా వచ్చిన పశువుల కాపరికి కేకలు వినిపించడంతో బావిలో ఓ వ్యక్తి పడినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
కాగా ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని దాబాలో భోజనం చేశాడు. అనంతరం ఫోన్ మాట్లాడుకుంటూ దాబా వెనక్కు నడిచివెళ్ళాడు. ఇదే సమయంలో అక్కడ పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆ బావిలో 20 అడుగుల లోతు నీరు ఉంది. చంద్రశేఖర్‌కి ఈత రావడంతో బావిలో ఉన్న చెట్ల వేర్లను పట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు.
 
అయితే బావిలో పడిన సమయంలో కాపాడాలంటూ కేకలు వేశాడు చంద్రశేఖర్, సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు. శుక్రవారం జీవన్ కుమార్ అనే వ్యక్తి పశువులు మేపుతూ బావి సమీపంలోకి వచ్చాడు. బావిలోంచి కేకలు వినిపించాయి. వెంటనే పోలీసులకు, స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించాడు. 
 
పోలీసులు ఫైర్ సిబ్బందిని తీసుకోని బావిదగ్గరకు వచ్చి మూడు గంటలు శ్రమించి బావిలించి బయటకు తీశారు. తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్‌.. తనను కాపాడిన జీవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా, పర్యాటక రంగాలకు జీఎస్టీ స్లాబు ఊతం :కందుల దుర్గేష్

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

JD Chakravarthy: డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు : జెడీ చక్రవర్తి

Nani: మోహన్ బాబు కీలక పాత్రలో నాని ది ప్యారడైజ్ చిత్రం

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments