Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వాంఛ తీర్చాలని బెదిరించాడు.. ప్రియుడితో తీసిన ఆ ఫోటో?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (14:31 IST)
స్కూల్, కాలేజీలో చదివే సమయంలో ప్రియుడితో కలిసి తీసుకున్న ఫోటో ఓ గృహిణికి శాపంగా మారింది. ఆ ఫోటోను చూపిస్తూ లైంగిక వాంఛను తీర్చాలంటూ ఓ యువకుడు ఆమెను వేధించాడు. దీంతో బాధితురాలు రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. 
 
నెల్లూరు జిల్లాకు చెందిన సంగన్న వెంకటరమణారెడ్డి ప్రస్తుతం మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లా వింజమూర్‌లోని పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సమయంలో అదే తరగతికి చెందిన విద్యార్థినితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ అప్పట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలను వెంకటరమణారెడ్డి దాచిపెట్టుకున్నాడు.
 
కాగా సదరు యువతికి 2011లో వేరొక వ్యక్తికి వివాహం అయ్యింది. ఆమె కుటుంబంతో కలిసి హైదరాబాద్ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు. యువతి భర్త ఓ భవన నిర్మాణ సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు ప్రస్తుతం తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే అదునుగా చూసుకుని వెంకటరమణారెడ్డి యువతికి ఫోన్ చేసి లైంగిక వాంఛ తీర్చాలంటూ వెంటపడ్డాడు. 
 
యువతి నిరాకరించంతో స్కూల్, కాలేజీ సమయంలో దిగిన ఫొటోలను ఆమె భర్త, బంధువులకు ెపంపాడు. భయాందోళనకు గురైన యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు నిందితుడు వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం