Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకొడుకు మూర్ఛరోగి.. శ్మశానానికి మోసుకెళ్లి.. గొంతునులిమి.. కిరోసిన్ పోసి?

కన్నకొడుకు మూర్చరోగి కావడం.. 23ఏళ్లు వచ్చినా ఆ వ్యాధి అతని వెన్నంటి రావడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కుటుంబ భారాన్ని మోయాల్సిన వయస్సులో భారంగా మారాడని భావించిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. గతేడాది

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (14:51 IST)
కన్నకొడుకు మూర్చరోగి కావడం.. 23ఏళ్లు వచ్చినా ఆ వ్యాధి అతని వెన్నంటి రావడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కుటుంబ భారాన్ని మోయాల్సిన వయస్సులో భారంగా మారాడని భావించిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. గతేడాది నవంబరు 15 అర్ధరాత్రి వేళ ఫిట్స్‌ వచ్చినప్పుడు కొడుకును స్వయంగా కన్నతండ్రే శ్మశానానికి మోసుకెళ్లాడు. అక్కడే కుమారుడి గొంతు నులిమి హత్య చేశాడు.
 
అంతటితో ఆగకుండా మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏమీ తెలియనట్లుగా ఇంటికొచ్చాడు. మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయి వుంటాడని ఇంట్లో వున్నవారందరినీ నమ్మించాడు. అయితే శ్మశానంలో శవం సగమే కాలింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. హంతకుడు తండ్రేనని తెలిసి షాక్ తిన్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఏడుగురు తల్లిదండ్రులకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేశారు. 
 
చివరికి కందులాపురం గ్రామానికి చెందిన కుల్లూరి శ్రీనివాసరావే హంతకుడని తేలింది. అతనికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు వెంకట్రావుకు 14 ఏళ్ల నుంచే మూర్ఛ వ్యాధి ఉంది. ఎందరు వైద్యులకు చూపించినా జబ్బు నయం కాలేదు. 23 ఏళ్ల వయస్సొచ్చినా భారంగా మారాడని చంపేశాడని తేలింది. ఏడాది తర్వాత ఈ కేసు కొలిక్కివచ్చింది. కన్నకొడుకు పడే బాధను చూడలేకే చంపేశానని శ్రీనివాసరావే ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments