Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమిస్తుంది... శృంగారం చేస్తుంది... ఆ తర్వాత లేపేస్తుంది.. ఎందుకో తెలుసా?

ఆమె చాలా డేంజరస్ లేడీ. డబ్బు కోసం పక్కా స్కెచ్ వేసి మగాళ్లను వలవేసి లాగేసి వరసబెట్టి హత్యలు చేసింది. ఈమె చేసిన దారుణాలకు ఆమెకు మరణ దండన విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే... జపాన్ దేశానికి చెందిన చిసాకో కాకేహి డబ్బు సంపాదనే లక్ష్యం చేసుకుంది. ఐతే

Advertiesment
Crime
, మంగళవారం, 7 నవంబరు 2017 (14:39 IST)
ఆమె చాలా డేంజరస్ లేడీ. డబ్బు కోసం పక్కా స్కెచ్ వేసి మగాళ్లను వలవేసి లాగేసి వరసబెట్టి హత్యలు చేసింది. ఈమె చేసిన దారుణాలకు ఆమెకు మరణ దండన విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే... జపాన్ దేశానికి చెందిన చిసాకో కాకేహి డబ్బు సంపాదనే లక్ష్యం చేసుకుంది. ఐతే ఆ డబ్బును ఈజీగా ఆర్జించడం ఎలా అని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసింది. 
 
తను వల వేసేందుకు మగాళ్ల కోసం డేటింగ్ సైట్లు, ఇతర ఏజెన్సీలను సంప్రదించేది. వాటి ద్వారా ఆమెకు పరిచయమైన మగాళ్లతో తొలుత ప్రేమ నటించేది. ఆ పైన వారితో శృంగారం చేసేది. అలా ఇద్దరమూ ఒకటే అనే భావన వారిలో కల్పించేసి ఆ తర్వాత వారి పేరుపై భారీగా బీమా చేయించేది. బీమా స్టార్టయిందంటే ఇక వారి చావు దగ్గరపడినట్లే. 
 
మెల్లగా సదరు వ్యక్తిని అనుమానం రాకుండా సైనెడ్ వేసి చంపేసేది. ఆ తర్వాత బీమా కంపెనీకి వెళ్లి చనిపోయిన వ్యక్తిపై వున్న డబ్బును వసూలు చేసుకుని సంతోషంగా మరో బకరా కోసం ఎదురుచూస్తుండేది. ఇలా తన భర్తతో పాటు మరో ఇద్దరు ప్రియుళ్లను దారుణంగా చంపేసింది. ఆమె వ్యవహారాన్ని ఛేదించిన పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విచారణ చేసిన కోర్టు ఆమెకి మరణ దండన విధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పానసోనిక్ నుంచి "ఎలుగా ఏ4": అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ చిప్‌తో డేటా జరభద్రం