Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని అబ్బాయిలకు శుభవార్త ... పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (12:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అబ్బాయిలకు ఇది నిజంగానే శుభవార్త వంటింది. ఈ రెండు రాష్ట్రాల్లో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే, మరో ఆరు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలతో అమ్మాయిల సంఖ్య 1021గా ఉంది. అయితే, అమ్మాయిల సంఖ్యలో కేరళ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ 1114 మంది అమ్మాయిలు ఉన్నారు. 
 
2021-22 గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యి మందిలో అబ్బాయిలకు కేరళలో 1114 మంది అమ్మాయిలు ఉన్నారు. ఏపీలో మాత్రం ఈ సంఖ్య 1046గా ఉంది. అయితే, జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలు ఉన్నారు. అయితే, 2019-20 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1021 మంది అమ్మాయిలు ఉండగా, 2021-22 నాటికి ఆ సంఖ్య 1046కి చేరింది. 
 
ఏపీలో మొత్తం 1,41,28,100 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 44,56,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 96,72,100 కుటుంబాలు ఉన్నాయి. సగటు కుటుంబ పరిమాణం 3.3గా ఉంది. పట్టణాల్లో ఇది 3.2గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇది 3.4గా ఉంది. 
 
2021-22 గణాంకాల మేరకు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే, కేరళలో 1114, ఏపీలో 1046, హిమాచల్ ప్రదేశ్‌లో 1031, తమిళనాడులో 1026, మేఘాలయలో 1017, ఛత్తీస్‌గఢ్‌లో 1016, జార్ఖండ్‌లో 1001 మంది చొప్పున అమ్మాయిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments