Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సంకల్పం చాలా దృఢం, అందుకే: శివరాజ్ సింగ్ చౌహాన్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (15:47 IST)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆలయంలో టిటిడి అధికారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఆలయం వెలుపల ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆత్మనిర్బర్ భారత్‌గా తీర్చిదిద్దుతామని ప్రధాని సంకల్పించారని చెప్పారు. మోడీ సంకల్పం గొప్పదన్నారు. ప్రజలందరి సహకారంతో భారతదేశం, మధ్యప్రదేశ్ రాష్ట్రం స్వయంసమృద్థి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. 
 
కరోనా వైరస్‌ను త్వరలో అంతం చేయాలని శ్రీవారిని వేడుకొన్నట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానన్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముఖ్యమంత్రితో పాటు బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments