Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు... మేం ఆత్మహత్య చేసుకుంటాం.. స్వాతి తల్లిదండ్రులు

అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్ రెడ్డి భార్య స్వాతి తల్లిదండ్రులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. మధుకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత స్వాతికి అత్తారింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె శుక్రవారం ఇం

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (13:50 IST)
అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్ రెడ్డి భార్య స్వాతి తల్లిదండ్రులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. మధుకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత స్వాతికి అత్తారింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె శుక్రవారం ఇంట్లోని హార్పిక్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
దీనిపై ఆమె తండ్రి స్పందిస్తూ.... గత రాత్రి స్వాతి అంతు చూస్తామంటూ, ఆమె ఎలా బతుకుతుందో చూస్తామంటూ బెదిరింపులు వచ్చాయని, అంతేకాకుండా ఆమె శీలాన్ని కించపరుస్తూ అత్తింటివారు పుకార్లు పుట్టిస్తున్నారని స్వాతి తండ్రి వాపోయారు. మధుకర్ రెడ్డి బంధువు రవీందర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని... మధుకర్ రెడ్డి అంత్యక్రియల రోజున తమపై దాడి చేసింది రవీంద్ర రెడ్డేనని ఆయన తెలిపారు. 
 
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. ఆ ధైర్యంతోనే ఆయన తమ జీవితాలతో ఆడుకుంటున్నాడని వారు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తమకు రక్షణ ఇవ్వకపోతే తమ అందరికీ సామూహిక ఆత్మహత్యే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదిలావుండగా, స్వాతి ఆత్మహత్య చేసుకో ప్రయత్నలో భాగంగా హార్పిక్ సేవించింది. మోతాదుకు మించి ఈ రసాయనం తాగడంతో ఆమె అన్నవాహిక బాగా దెబ్బతింది. దీంతో ఆమె సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ముఖ్యంగా.. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆమెను కాపాడడం కష్టమని వైద్యులు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments