Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం

Webdunia
ఆదివారం, 31 మే 2020 (17:56 IST)
ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవులు ప్రాంతాలలో ఆదివారం(మే 31వ తేదీన) ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటలలో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉంది. తర్వాత ఇది ఉత్తర దిశగా ప్రయాణించి జూన్ 3వ తేదీకల్లా ఉత్తర మహారాష్ట్ర మరియు గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. 
 
రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని  ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన కేరళ రాష్ట్రంలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
 
ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మరియు కేరళ మీదుగా 0.9 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, ఎల్లుండి కొన్నిచోట్ల, రేపు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడురోజులు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments