Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణం... ఏపీకి అల్పపీడనం తప్పినట్టే!

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (10:22 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో మ‌ళ్ళీ తుపాను వ‌స్తుంద‌ని జ‌నం బెంబేలుప‌డుతున్నారు. అయితే, ఆ ముప్పు త‌ప్పిన‌ట్లే అని విశాఖ వాతావ‌ర‌ణ శాఖ వారు తెలియ‌జేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 
దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంద‌ని  విశాఖ వాతావ‌ర‌ణ శాఖ వారు తెలియ‌జేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments