Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నుంచి ప్రేమికులు జంప్.. తాళిబొట్టు కొంటూ వుండగా యువతి ఎస్కేప్

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:13 IST)
వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ వేశారు. ఫ్రెండ్స్ కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అనుకున్నదే తడవుగా బైక్ పై ఆలయానికి వెళ్లిపోయారు. పెళ్లి కోసం కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేస్తుండగా అమ్మాయి ఎస్కేప్ అయింది. దీంతో షాక్ అవడం అబ్బాయి వంతైంది.
 
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు నగరంలోని రాణీనగర్ కు చెందిన యువకుడు కుమార్ రాజా.. నగరానికే చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఇష్టపడ్డారు. దీంతో కుమార్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పాడు. వారు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి.. కుమార్ రాజాతో కలిసి బైక్ ఎక్కింది. వారితో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు.
 
నలుగురు కలిసి ఎలూరు నుంచి ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లారు. ఐతే అక్కడే నెలకొంది అసలు ట్విస్ట్. పెళ్లి కోసం పూలదండలు, తాళిబొట్టు, ఇతరత్రా సామాగ్రి కొనుగోలు చేస్తుండగా సడగ్ యువతి అక్కడి నుంచి మాయమైంది. నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కుమార్ రాజా అతని స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లేవరకు పెళ్లి చేసుకోవడానికే తీసుకెళ్లినట్లు తనకు తెలియదని విద్యార్థిని చెప్పినట్లు తెలుస్తోంది. తనను బలవంతంగా పెళ్లి చేసుకోబోయారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
 
పోలీసులు కుమార్ రాజాతో పాటు అతడి స్నేహితులు దుద్దే ప్రశాంత్ కుమార్, కవులూరి నాగాచారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మైనర్ కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments