Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ హోటల్‌లో బిర్యానీ కోసం జొమాటో డెలివరీ బాయ్స్ ‘క్యూ’!

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:12 IST)
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి వస్తువూ డోర్ డెలివరీ చేయబడుతోంది. మరీ ముఖ్యంగా ఆహారానికి కూడా హోటళ్లకు వెళ్లనవసరం లేకుండాపోయింది. మీ మొబైల్‌లో యాప్ ఉంటే చాలు. మీరు ఎక్కడ ఉంటే అక్కడకు ఆహారం నిమిషాల వ్యవధిలో వచ్చేస్తుంది.


దీంతో జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హోటళ్లలో కస్టమర్ల కంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. 
 
తాజాగా జొమాటో సంస్థ ఓ హోటల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్స్ క్యూలో నిల్చున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. ఇక్కడ నిలుచున్న వారు హైదరాబాద్‌లోని బావర్చి బిర్యానీ ఔట్‌లెట్ వద్ద హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్‌లు తీసుకువెళ్లేందుకు క్యూలైన్‌లో నిలుచున్నారని పేర్కొంది. 
 
అంటే హైదరాబాద్ నగరంలో బిర్యానీకి ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ హోటల్‌లో బిర్యానీ కోసం రోజుకు 2000 ఆర్డర్‌లు వస్తున్నాయని జొమాటో సంస్థ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments