Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో లిక్కర్ మ్యూజియం... ఘాటైన రుచితో ఆకట్టుకునే ఫెనీ

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (10:29 IST)
గోవా అంద‌రినీ ఎంతో అల‌రించే పర్యాటక స్థలం. భారత్ వచ్చే విదేశీయుల్లో అత్యధికులు గోవాను తప్పక సందర్శిస్తుంటారు. గోవా సంస్కృతి కూడా పాశ్చాత్యదేశాల సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. ఇక‌ గోవాలో తాజాగా ఓ లిక్కర్ మ్యూజియం ఏర్పాటైంది. లిక్కర్ కు మ్యూజియం ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం. నందన్ కుచాద్కర్ అనే స్థానిక వ్యాపారవేత్త ఈ మ్యూజియం నెలకొల్పాడు. ఉత్తర గోవాలోని కండోలిమ్ గ్రామంలో ఈ మ్యూజియాన్ని చూడొచ్చు.
 
గోవాలో స్థానికంగా ఫెనీ అనే మద్యాన్ని తయారు చేస్తారు. జీడి మామిడి ఫలాల నుంచి తయారుచేసే ఫెనీ మద్యం ఎంతో పేరుగాంచింది. ఒక రకంగా ఫెనీ మద్యం గోవాకు వారసత్వ సంపద వంటిదని చెప్పాలి. అందుకే ఈ మ్యూజియంలో ఫెనీ తయారీకి ఉపయోగించే వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఫెనీ మద్యం నిల్వకు ఉపయోగించే భారీ పాత్రలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి.
 
నందన్ కుచాద్కర్ కు పురాతన కళాఖండాల సేకరణ ఓ హాబీ. దాంతో వందల ఏళ్ల నాటి ఫెనీ తయారీ ఉపకరణాలను కూడా సేకరించి ఈ మ్యూజియంలో ఉంచారు. దీనిపై నందన్ కుచాద్కర్ స్పందిస్తూ... ఇలాంటి ఓ మ్యూజియం స్థాపించాలన్న ఆలోచన రాగానే, ప్రపంచంలో ఇలాంటిది ఇంకెక్కడైనా ఉందా అని యోచించినట్టు తెలిపారు. స్కాట్లాండ్, రష్యా దేశాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న మద్యాన్ని సంతోషంగా ప్రదర్శిస్తుంటారని, కానీ ఓ మ్యూజియాన్ని లిక్కర్ కోసం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అని వెల్లడించారు.
 
మ్యూజియం సీఈఓ అర్మాండో డువార్టే మాట్లాడుతూ, గోవాలో అతిథులు వచ్చినప్పుడు మద్యంతో విందు సంప్రదాయమని తెలిపారు. ఇక, ఓ పర్యాటకుడు ఇక్కడి మ్యూజియాన్ని సందర్శించిన అనంతరం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మద్యం గురించి ఇక్కడ పొందుపరిచిన సమాచారం అద్భుతమని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments